విలేజ్‌ క్లినిక్స్‌తో ఆరోగ్య భరోసా

Mar 1,2024 00:16

ప్రజాశక్తి – కర్లపాలెం
గ్రామాల్లో వైద్యుడి కోసం రోగులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజలు వద్దకే వైద్యులను పంపిస్తున్న ఘనత వైసిపీ ప్రభుత్వానిదని ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. మండలంలోని పాత నందాయపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చని తెలిపారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌, కొన ప్రభాకరరావు విగ్రహాలు ఆవిష్కరించారు. వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కావూరి చిట్టెమ్మ, వైసిపి మండల అధ్యక్షులు యల్లవుల ఏడుకొండలు, ఎఎంసీ చైర్మన్ దొంతిబోయిన సితారామిరెడ్డి, ఎంపీపీ యారం వనజ, ఎంపీటీసీలు తాండ్ర సాంబశివరావు, షేక్ ఆసిఫ్, వైసిపీ నాయకులు చీరాల సత్యనారాయణరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, స్తలదాత తునుగుంట్ల జగదీష్ పాల్గొన్నారు.

➡️