ఖతార్‌పై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌

చండీగఢ్‌ :    ముఖ్యమంత్రి ఖతార్‌ నేతృత్వంలోని బిజెపి-జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. హర్యానా ముఖ్యమంత్రి ఖతార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ జియాన్‌ చంద్‌ గుప్తా చర్చకు స్వీకరించారు. సుమారు రెండుగంటల పాటు చర్చ సాగినట్లు సమాచారం. ఖతార్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, బడ్జెట్‌ సెషన్‌లో కాంగ్రెస్‌ అవిశ్వాసం తీసుకువస్తుందని ప్రతిపక్ష నేత భూపిందర్‌సింగ్‌ హుడా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

90 అసెంబ్లీ స్థానాలు కలిగిన హర్యానాలో బిజెపికి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జెజెపికి 10 మంది ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులలో ఆరుగురు, లోఖిత్‌ పార్టీ ఎమ్మెల్యే గోపాల్‌ కందా కూడా బిజెపికి మద్దతిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి)కి ఒకరు ఉన్నారు. మూడేళ్ల క్రితం కూడా బిజెపి -జెజెపిపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చింది. అయితే అది వీగిపోయింది.

➡️