తమిళనాడు : నేడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ 73వ పుట్టినరోజును పురస్కరించుకొని … సోషల్ మీడియాలో అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రపరిశ్రమ నుండి ప్రముఖులంతా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీకాంత్ 170 వ సినిమా టైటిల్ టీజర్‌ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు అన్నదానం చేయడం గమనార్హం.
హీరో ధనుష్ విషెస్ …
ఈ క్రమంలో రజినీకాంత్‌కు హీరో ధనుష్ బర్త్ డే విషెస్ తెలిపారు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్.. తలైవా రజనీకాంత్‌కు అల్లుడేనన్న సంగతి విదితమే. కానీ ఐశ్వర్యతో కొన్ని విభేదాలు రావడంతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నారు. కానీ రజనీకాంత్‌పై ధనుష్‌కు ఉన్న గౌరవం, ప్రేమను ఇలా సందర్భాన్ని బట్టి చూపిస్తుంటారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా .. నటుడు ధనుష్ తన ఎక్స్ పేజీలో ”హ్యాపీ బర్త్ డే తలైవా” అని రాశారు. అలాగే, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో హెచ్‌బిడి సూపర్ స్టార్ రజనీకాంత్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. గతంలో జైలర్ సినిమా విడుదలైన సమయంలో కూడా ధనుష్ రియాక్ట్ అయ్యారు. ఈ వారం అంతా జైలర్దే అంటూ ట్వీట్ చేశారు. ధనుష్ శుభాకాంక్షలను చూసిన అభిమానులు వారి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా రజనీపై ధనుష్ అభిమానం తగ్గలేదని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.