పొదిలి (ప్రకాశం) : ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం పొదిలిలోని స్థానిక టైలర్స్ కాలనీలో జరిగింది. ఓ ఇంట్లోని మెట్ల మీద రవికుమార్ (40) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.