ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం

Apr 20,2024 11:52 #Hailstorm, #Nizamabad district

నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సఅష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. టార్పాలిన్లు లేకపోవడంతో వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వారం రోజులైనా ధాన్యం కాంటా అవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాము నష్టపోయామంటున్నారు.
గాలివాన బీభత్సంతో చెట్లు నేలకొరకగా, పలుచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్‌లో పిడుగుపడి మూడు గేదెలు మృతి చెందాయి.

➡️