హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రూ.16,512 కోట్ల లాభాలు

Apr 20,2024 22:04 #Business, #hdfc bank

ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 37.1 శాతం వృద్థితో రూ.16,512 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 24.5 శాతం పెరిగి రూ.29,077 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం రూ.18,166 కోట్లుగా చోటు చేసుకుంది. ఇది ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.8,731 కోట్లుగా ఉంది. త్రైమాసిక ఫలితాల సందర్బంగా ఆ బ్యాంక్‌ 2023-24కు గాను ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.19.5 డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చి ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఎలు 0.33 శాతానికి పరిమితమయ్యాయి.

➡️