డ్రైవర్‌ లేకుండానే 100 కి.మీ. ప్రయాణించిన రైలు

 శ్రీనగర్‌ :    డ్రైవర్‌ లేకుండానే ఓ గూడ్స్‌ ట్రైన్‌ 100 కి.మీ ప్రయాణించిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది.  ఆదివారం ఉదయం 8.47 గంటల సమయంలో క్రషర్లతో నిండిన గూడ్స్‌ రైలు జమ్మూలోని కతువా స్టేషన్‌ నుండి పంజాబ్‌లోని హోషియాపూర్‌ వైపు వేగంగా ప్రయాణించడం ప్రారంభించింది. రైలు ఇంజన్‌ పవర్‌ ఆఫ్‌లో ఉండగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

రైల్వే అధికారుల వివరాల ప్రకారం..   కథువా స్టేషన్‌లో డ్రైవర్‌ దిగిపోయినప్పటికీ .. నెంబర్‌ 14806 గల ట్రైన్‌ ఆగకుండా సుమారు 100 కి.మీ ప్రయాణించింది. చివరకు పంజాబ్‌లోని ముకేరియన్‌ సమీపంలో నిలిచిపోయింది.  అప్రమత్తమైన అధికారులు   లెవెల్‌ క్రాసింగ్‌లను మూసి వేయాల్సిందిగా గేట్‌మెన్‌లకు మెసేజ్‌ పంపడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు.  దసుహా వద్ద రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి రైలును ఆపడంలో రైల్వే అధికారులు సఫలీకృతులయ్యారు. హ్యాండ్‌బ్రేక్‌ వేయడం మర్చిపోయి ఎక్కడికో వెళ్లిపోయానని, ఆ తర్వాత వాలు కారణంగా రైలు ఆటోమేటిక్‌గా ట్రాక్‌పై కదలడం ప్రారంభించిందని రైలు డ్రైవర్‌ పేర్కొన్నారు. రైలు కదులుతున్నప్పుడు తాను అక్కడ లేనని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు. విచారణ నిమిత్తం ఫిరోజ్‌పూర్‌ నుండి బృందం  జమ్మూ చేరుకుంటుంది.

➡️