క్రీడలతో మంచి ఆరోగ్యం : ఎమ్మెల్యే కరణం వెంకటేష్‌బాబు

Feb 2,2024 22:27

ప్రజాశక్తి – చీరాల
క్రీడల్లో యువత ఉత్సాహంగా పాల్గొనాలని, క్రీడలతో శరీర దారుణ్యంతోపాటు మంచి ఆరోగ్యం లభిస్తోందని వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. స్థానిక ఎన్ ఆర్ అండ్ పిఎం హైస్కూల్ ఆవరణంలో జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇస్తర్ల బాబురావు, సుభాషిణి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఛాంపియన్ షిప్ అండర్-17, 19 షూటింగ్ బాల్ పోటీలు గురువారం ముగిసాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబురావు మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు, బాలికల విభాగంలో మహారాష్ట్ర జట్టు విజయం సాధించినట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. స్నేహపూరిత వాతావరణంలో క్రీడల్లో యువత పాల్గొని విజయం సాధించాలని కోరారు.

➡️