Gold: 1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..

Mar 10,2024 12:38 #America, #Gold, #trasur

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధిని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. మధ్య అమెరికా దేశమైన పనామాకు 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్కులో 1200 ఏళ్లనాటి ఈ పురాతన సమాధిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ తవ్వకాలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాటితోపాటు పెద్ద ఎత్తున బంగారు నిధి బయటపడింది. అలాగే, బంగారంతో తయారుచేసిన దుస్తులు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు, గంటలు, బెల్టులు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, నగలు, సిరామిక్ వస్తువులు వంటివి గుట్టలుగా ఉన్నాయి. ఇది కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా దీనిని గుర్తించారు. చనిపోయిన వ్యక్తితోపాటు ఆయనకు తోడుగా ఉండేందుకు బలిదానం చేసిన 32 మంది శవాల అవశేషాలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

➡️