ఆకట్టుకునేలా.. ఆనందంగా..

Feb 18,2024 08:58 #Balotsavam, #Sneha

రెండు రోజులపాటు నిర్వహించిన గోదావరి బాలోత్సవంలో సుమారు 5,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి.క్రాంతికుమార్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. రెండోరోజు బాలోత్సవంలో ఆదివారం అకడమిక్‌, కల్చరల్‌ విభాగాల్లో జరిగిన పోటీల్లో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్పెల్బీ, కార్టూన్‌, చిత్రలేఖనం, వక్తృత్వం, కథలు చెప్పడం, క్విజ్‌ పోటీల్లో సీనియర్స్‌, జూనియర్స్‌ విభాగాలుగా జరిగాయి. అలాగే అంతర్జాలంలో అన్వేషణ, సీనియర్స్‌ విభాగంలోనూ పద్యం-భావం జూనియర్స్‌, వక్తృత్వం తెలుగులో సీనియర్స్‌ జూనియర్స్‌గాను పోటీలు నిర్వహించారు. మట్టితో బొమ్మలు చేయడంలోనూ పిల్లలు పోటీపడి వివిధ కళా ఖండాలను తీసుకొచ్చారు. ప్రధాన వేదిక వద్ద కల్చరల్‌ విభాగంలో జానపద నృత్యం చేశారు. స్టేజ్‌ 5 వద్ద క్లాసికల్‌ డ్యాన్స్‌తో చిన్నారులు ఆకట్టుకున్నారు. లఘునాటిక ఏకపాత్రాభినయం విభాగాల్లో చిన్నారులు స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే దేశభక్తి అభ్యుదయ జానపద గీతాలాపనలో తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్స్‌ విభాగంలో బృందాలుగా చేసిన కోలాటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణ పోటీల్లో వివిధ ప్రదర్శనలు చేశారు.

పి. తులసి, గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ.

➡️