సెప్టెంబర్‌ 5న గోట్‌ విడుదల

తమిళ హీరో విజయ్ నటిస్తున్న 68వ సినిమా ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌-గోట్‌’ సెప్టెంబర్‌ 5వ తేదీన విడుదల కానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, మిక్‌ మోహన్‌, జయరాం, కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజరు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 1971లో డిబి కూపర్‌ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి దానిలో నుంచి పారాచ్యూట్‌తో దూకేశాడు. ఆ వ్యక్తి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆ మిస్టరీని కథాంశంగా తీసుకుని ఈ సినిమా నిర్మిస్తున్నట్లుగా సమాచారం.

➡️