164 గోవా మద్యం బాటిళ్ళు స్వాధీనం

Jan 27,2024 16:43 #Kadapa
goa liqour smuggling

ప్రజాశక్తి – వేంపల్లె : గోవా నుండి ఆక్రమంగా తీసుకొని వచ్చిన 164 మద్యం బాటిళ్ళును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చాంద్ బాషా తెలిపారు. శనివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేముల మండలం కొండ్రెడ్డి పల్లె గ్రామానికి చెందిన మోపురి గంగులయ్య (సింహాద్రి) అనే వ్యక్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టీ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆదాయం సరిపోకపోవడంతో గోవాలో చీప్ లిక్కర్ మద్యం తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువ డబ్బులతో మద్యం విక్రయాలు చేస్తే ఆదాయం ఎక్కువగా వస్తుందనే ఆలోచనతో మోపురి గంగులయ్య గోవాకు వెళ్లి చీప్ లిక్కర్ ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. గోవా నుండి రెండు బ్యాగుల్లో రాయల్ క్లాస్ మాల్ట్ విక్కీ బాటిళ్ళు, హన్ని గ్రాండ్ బ్రాంది, రాయల్ క్వీన్ మాల్ట్ విక్కీ, మ్యాన్స్ హౌస్ ఫ్రాంచీ బ్రాంది మద్యం బాటిళ్ళుకు చెందిన 164 బాటిళ్ళు తెచ్చినట్లు చెప్పారు. శనివారం గోవా నుండి మద్యం బాటిళ్ళును తీసుకొని ట్రైన్ లో యర్రగుంట్లలో దిగి వేంపల్లెకు గంగులయ్య వచ్చినట్లు చెప్పారు. గోవా నుండి తెచ్చిన మద్యాన్ని ఆక్రమంగా విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సిఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో కడప – పులివెందుల బైపాస్ రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద గంగులయ్యను తనీఖీ చేయగా గోవా మద్యం బాటిళ్ళు బయట పడినట్లు చెప్పారు. దీంతో మోపురి గంగులయ్యను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 164 గోవా మద్యం బాటిళ్ళును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. అలాగే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు చెప్పారు. గోవా మద్యం పట్టుకొనేందుకు సాహసించిన సిబ్బందికి తగు రివార్డ్ ను అందజేశారు.

➡️