కార్పొరేషన్ల వద్ద అంగన్వాడీల ధర్నా

Dec 18,2023 14:26 #Guntur District
gnt anganwadai strike continue 7th day mangalagiri

ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడాన్ని నిరసిస్తూ అంగన్వాడి యూనియన్లు, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలో ప్రదర్శన నిర్వహించి మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగాయీ, ఏం భాగ్యరాజు, వై కమలాకర్, ఎస్ గణేష్, ఎం బాలాజీ పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించారు కొరకు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హెచ్చరించారు. ప్రభుత్వం చట్ట విరుద్ధం అంగనవాడి కేంద్రాల తాళాలను పగలగొడుతున్నారని విమర్శించారు. రౌడీ రాజ్యంలో పరిపాలన చేస్తున్నారని అన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

➡️