గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న టూరిజం ఆపాలి 

girijana sangham on tourism in maredumilli
  • గిరిజన సంఘం డిమాండ్

ప్రజాశక్తి-మారేడుమిల్లి : గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న మారేడుమిల్లి టూరిజం తక్షణం ఆపాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆదివారం డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టూరిజంకు వచ్చే వాహనదారులు అనేకమంది విచ్చల విడిగా మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మారేడుమిల్లి గురుకుల కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి కి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యవాత పడ్డాడని ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా సర్పంచ్ మృతి చెందడం జరిగిందని ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన అధికారులు దృష్టి సారించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి విషయంలో అధికారులు పక్షపాత వైఖరి అవలంబించకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని యాక్సిడెంట్ చేసిన వాహనదారులను కఠినంగా శిక్షించాలని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

➡️