హైడ్రో పవర్ ప్లాంట్ పనులను అడ్డుకున్న గిరిజనులు

girijans stop hydro power plant

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీలోని బలిపురం సమీపం నుండి వీలుపర్తి పంచాయతీ మారిక కోండ వరకు అదాని కంపిని తలపెట్టిన హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను గురువారం గిరిజనులు అడ్డుకున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి వందలాది మంది గిరిజనులు చేరుకోని, 12 గంటలు వరకు పనులు చేస్తున్న సిబ్బంది రాకపోవడంతో పెద్ద ఎత్తున నిర్సన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర వీరికి పూర్తిగా మద్దతు నిచ్చి మాట్లాడారు. హైడ్రో పవర్ ప్లాంట్ పనులు కోసం కలకత్తాకు చేందిన కోంతమంది కంట్రాక్టుర్లు, యంత్రాలు ద్వారా స్వాయల్ పరిక్షలు చేస్తున్నారని స్తానింగా ఎవరికీ తెలియకుండా పునులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. గతంలో రైవాడ ప్రాజెక్టుపై హైడ్రో పవన్ ప్లాంట్ చేపాడుతున్నట్లు దీనికి కేబ్ నేట్ అమోదం పోందినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాని తెలిపారు. చింతలపూడి పంచాయతీలో బలిపురం సమీపం నుండి మారిక కోండకు హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం పనులు ప్రారంబించారని ఇది పూర్తి అయితే అటు చింతలపూడి పంచాయతీలోని గిజనులకు ఇటు రైవాడ ఆయకట్టు రైతులకు విశాఖ త్రాగు నీటి ఆవసారాలకు తీవ్రమైన ప్రమాదం ఎర్పడుతుందని తెలిపారు. వెంటనే ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో అదాని కంపెనీకి చేందిన అనేక ప్రాజెక్టులకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన అక్కడ గిరిజనులు ముక్త కంఠంతో వ్యతిరేఖించారని ఇక్కడ అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారని తెలిపారు. రైవాడ రీజర్వేయరుకు జీవనదిగా ఉన్న శారదా నదిపై రెండు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు కట్టి దాని ద్వారా హైడ్రో పవర్ ప్లాంట్ ను నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది పూర్తి అయితే చింతలపూడి పంచాయతీ లో సగం గ్రామాలు కాలి అవ్వడంతో పాటు వేలాది ఎకారాలకు సాగు నీరు విశాఖ త్రాగునీటికి విఘాతం పర్యా.వరణానికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు. హైడ్రో, ప్రాజెక్టు వలన ఈప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే పనులు నిలుపుదల చేసి యంత్రాలను వెనుకకు తీసుకుపోవాలని కోరారు. లేదంటే పనులు జరుగుతున్న ప్రాంతంలోని వంటావార్పు కార్యక్రమం చేపట్టి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు తుమ్మిడి అప్పలరాజు దోరతో పాటు చింతలపూడి తామారబ్బ పంచాయతీలకు చేందిన వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు.

➡️