చిన్నారులకు బహుమతులు

Dec 27,2023 00:20

ప్రజాశక్తి – చీరాల
క్రిస్మస్ పండుగ సందర్బంగా స్థానిక సెయింట్ మర్క్స్ లూధరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సండే స్కూల్ చిన్నారులకు ఆటల పోటీలు, క్విజ్, కంఠత వాక్యాలు, పలు సంస్కృతిక పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు తహశీల్దారు జె ప్రభాకరరావు పంపిణీ చేశారు. చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వాక్యపదేశం చేశారు.

➡️