ఘంటసాల జయంతి మాసోత్సవాలు

Dec 2,2023 01:06

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
ఘంటసాల 101వ జయంతి సందర్భంగా ఘంటసాల చైతన్య వేదిక, సీనియర్ సిటీజన్స్, జెవివి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని ఘంటసాల విగ్రహం వద్ద జయంతి మాసోత్సవాలు శుక్రవారం ప్రారంభించారు. కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టి సంగీత ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయుడు ఘంటసాల అని అన్నారు. మూడు దశాబ్దాల పాటు ఆరు భాషల్లో పదివేల పాటలు పాడారని అన్నారు. దేశభక్తి గీతాలూ ఆలపరించారని అన్నారు. ఘంటసాల చైతన్య గీతాలు నేటి యువతకి స్ఫూర్తి అని అన్నారు. సామాజిక మార్పుకోసం ఘంటసాల కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ సాదిక్, జాలా రామీరెడ్డి, బుర్ర వలిబాబు, నిర్మలమ్మ, మనోహర లోహియా, దాసరి లక్ష్మి, లింకన్, పోలిరెడ్డి, రేణుక, సూరిబాబు పాల్గొన్నారు.

➡️