‘ఉద్యోగాలివ్వండి’ : సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద డీఎస్సీ-2008 అభ్యర్థులు

తెలంగాణ : ‘ఉద్యోగాలివ్వండి’ అంటూ … వినతిపత్రాన్ని సమర్పించడానికి డీఎస్సీ-2008 అభ్యర్థులంతా కలిసి సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ … తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం … కామన్‌ మెరిట్‌లో ఎంపికై నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఆరు వారాల్లో పోస్టులను భర్తీ చేయాలని గతంలో హైకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

➡️