కోహ్లి కెప్టెన్సీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Dec 5,2023 17:43 #Sports, #Virat Kohli

విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదన్నారు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత? ఓవర్ల ఫార్మాట్‌ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్‌ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్‌ మెషీన్‌ ఆతర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.

➡️