ఐక్యత కొరకు ఆటలు.. యువజన మైత్రికి బాటలు

Jan 16,2024 12:11 #Bapatla District
games in sankranti festival

ప్రజాశక్తి – నిజాంపట్నం : ఎస్ఎఫ్ఐ, సిఐటియు, మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఐక్యత కొరకు ఆటలు యువజన మైత్రికి బాటలు అనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు , నిజాంపట్నం ఎంపీపీ హరినాథ్ బాబు, మరియు గ్రామ పెద్దల సౌజన్యంతో ముగ్గుల పోటీలు ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి మోకా సౌజన్య, రెండో బహుమతి సున్నంపూడి శ్రీలక్ష్మి, మూడవ బహుమతి మోపిదేవి నాగజ్యోతి గెలుపొందారు ఈ సందర్భంగా సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సి.హెచ్ మనిలాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందని పిండి వంటలే కాక మహిళలు ముగ్గులు వేయడం వాళ్లని ప్రోత్సహించడం సంక్రాంతికి ప్రాధాన్యత సంతరించుకుందని, అందరూ కలిసి ఎంత ఆనందంగా జరుపుకునే పండుగని దానికి సిఐటియు, మహిళా సంఘం సమస్యలపై పోరాటాలే కాక మహిళను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని అన్నారు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎస్ఎఫ్ఐ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుందని నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటాలే కాకుండా విద్యార్థులను చదువుల్లోనూ ఆటపాటలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని ఎంతోమంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి విచ్చేసి బహుమతులు గెలుపొందారని సంక్రాంతి పండుగ రోజు విద్యార్థులు మద్యం డ్రగ్స్ ఇతర చెడు మార్గాలకు అలవాటు పడకుండా అందరిలోనూ స్నేహభావం పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సహకరిస్తున్న గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో మొగడారమ్మ గుడి కమిటీ చైర్మన్ కన్నా శ్రీనివాసరావు, యుటిఎఫ్ నిజాంపట్నం మండల కార్యదర్శి చుక్క బాపయ్య, ఐద్వా రేపల్లె డివిజన్ నాయకురాలు ఝాన్సీ రాణి , నిజాంపట్నం నాయకులు ఉషారాణి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రేమ్ చంద్, తదితరులు పాల్గొన్నారు.

➡️