పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ వాహనాలకు జిపిఎస్‌

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ కోసం వాడే అన్ని వాహనాలకు జిపిఎస్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఎలక్షన్‌ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశామని అన్నారు. ఎన్నికల సంఘం అధికారి మాట్లాడుతూ …. ఇవిఎం సహా ఇతర సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించే సమయంలో, ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లకు తీసుకొచ్చేవరకు పర్యవేక్షించడానికి జిపిఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఉపయోగించనున్నామన్నారు. ఏమైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామని చెప్పారు. డ్రైవర్లు సహా పోలింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను ప్రశ్నిస్తామన్నారు.

➡️