సూపర్ సిక్స్‌తో భవిష్యత్ గ్యారెంటీ

Feb 28,2024 23:41

ప్రజాశక్తి – రేపల్లె
టిడిపి, జనసేన సంయుక్తంగా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో భావితరాలకు భవిష్యత్తు లభిస్తుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. బాబుష్యురిటి, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని పట్టణంలోని 14, 15వార్డుల్లో బుధవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మేఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పధకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్వాంసం సృష్టించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపును ఎవ్వరు అపలేరని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనకు ప్రజలు చమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. అందుకు ప్రజలు మద్దతు ఉందన్నరు. బటన్ నొక్కి ప్రజలపై పన్నులు వేస్తూన్న సిఎం వైఎస్‌ జగన్‌ను గద్దే దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు జిపి రామారావు, జీవి నాగేశ్వరరావు, వెనిగళ్ల సుబ్రహ్మణ్యం, గొట్టిపాటి మహేష్, కేసన నరసింహారావు పాల్గొన్నారు.

➡️