బిల్లులు ఇవ్వలేదంటూ ఫర్నిచర్ ధ్వంసం

Apr 1,2024 16:29 #sri satyasai district

ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వలేదంటూ కాంట్రాక్టర్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.  మునిసిపల్ కార్యాలయంలో అకౌంటెంట్ గదిలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన కాంట్రాక్టర్లు గదికి తాళం వేసి నిరసనకు దిగారు. 15 మంది కాంట్రాక్టర్లకు దాదాపు రూ 3 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ ఉందంటూ  అధికారులు వెళ్లిపోయారు. దీంతో హిందూపురం మున్సిపాలిటీలో పనులు చేసిన వాటికి సంబంధించిన బిల్లులు మార్చి 31 నాటికి ముగియనుంది. ప్రభుత్వం మారితే మాకు బిల్లులు ఇచ్చే వారు ఎవరంటూ ఆగ్రహించిన కాంట్రాక్టర్లు అకౌంట్ సెక్షన్ లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గదికి వెళ్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి జరిగిన సంఘటనపై పరిశీలించి వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తామని తెలిపారు.

➡️