ఆడిటోరియం నిర్మాణానికి 30 లక్షలు మంజూరు

Jan 15,2024 12:52 #Chittoor District
funds release to school stadium
  • మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-సోమల : చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీధి బడిగా ప్రారంభమై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాయికి ఎదిగి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలలో చివరి రోజు సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాలలో ఆడిటోరియం నిర్మాణానికి 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలో జెండా ఆవిష్కరణ వివేకానంద విగ్రహ ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యతతో కూడిన బట్టలు పుస్తకాలు ట్యాబులు ఉచితంగా అందజేయడమే కాకుండా అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతోందని స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే ఇటువంటి పథకం గాని, అభివృద్ధి గాని ఎక్కడ చూడలేదని అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై ఆక్కసు వెళ్ళబోసుకున్న చంద్రబాబు నాయుడు తన పిల్లలను మాత్రం ఇంగ్లీషు పాఠశాలల్లో చదివిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేయాలని అనుకున్నారని వాటన్నిటిని జగన్ తిప్పి కొట్టి విద్యార్థులకు ఆంగ్లంలోనే పాఠాలు బోధించే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా డీఈవో పురుషోత్తం సోమల ఎంఈఓ శివరత్న నంజంపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుసుమాంబ పాఠశాలలో పనిచేసి రిటైర్మెంట్ అయిన పలువురు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️