Congress : మరోసారి ఆదాయ పన్ను శాఖ నోటీసులు

Mar 29,2024 12:31 #Congress, #Income Tax department

న్యూఢిల్లీ   :  ప్రతిపక్ష కాంగ్రెస్‌పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటి శాఖ శుక్రవారం మరోసారి కాంగ్రెస్‌కు నోటీసులిచ్చింది. 2017-18 నుండి 2020-21 మధ్య జరిమానా, వడ్డీలతో కలిపి రూ. 1700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత నెల ఫిబ్రవరిలో పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల జరిమానా విధించింది. కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటిఎటి) ఫ్రీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఐటి  నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఆ మరుసటి రోజు ఐటి శాఖ మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఐటి నోటీసులపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

➡️