ప్రభుత్వ కుల వెబ్‌ సైట్‌లో నుంచి వాల్మీకి కులం తొలగింపుపై మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా ఖండన

అల్లూరి జిల్లా : రెవెన్యూ కి సంబంధించిన కుల వెబ్‌ సైట్లో గిరిజన తెగల జాబితాలో ఉన్న వాల్మీకి ఉపకులాన్ని ప్రభుత్వ క్యాస్ట్‌ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము కారణంగా మళ్లీ తొలగించారని, దీనికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం గిరిజన వాల్మీకి తెగపై రాజకీయ స్వలాభం కోసమే వెబ్‌సైట్‌ నుంచి మళ్లీ తొలగించారని తెలిపారు. వాల్మీకి తెగలపై కన్నేసిన ఈప్రభుత్వంపై రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఇంత అన్యాయం వాల్మీకి తెగకు జరుగుతున్నప్పటికీ కనీసం గిరిజన ప్రజా ప్రతినిధి అయిన ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపిటిసి లకి కనీసం చీమ కుట్టినట్లు కూడ అనిపించటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరిచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️