అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే

Apr 11,2024 20:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి కొనియాడారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, నగర మేయర్‌ విజయలక్ష్మి, బిసి సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ బిసిల అభ్యున్నతికి పూలే చేసిన ఎనలేని కృషి మరువలేనిదన్నారు. మహిళలు కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలుగా తీర్చిదిద్ది దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని అన్నారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాలు అనుసరణీయమని అన్నారు. వెనుకబడిన వర్గాల హదయాలలో చెరగని ముద్రగా నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు నడిపేన శ్రీనివాసరావు, బొద్దాన అప్పారావు, మారం బాల బ్రహ్మారెడ్డి, గదుల సత్యలత, కెల్ల త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.పూలే ఆశయాలను ముందుకు తిసుకువెళ్లాలి విజయనగరం కోట : జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఉత్తరాంధ్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు అన్నారు. ఉత్తరాంధ్ర బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన పూలే జయంతి నిర్వహించారు. పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, మొదిలి నాగభూషణరావు, గుంప అప్పలరాజు, మజ్జి అప్పారావు, చోడి ఆదినారాయణ, పాండ్రంకి వెంకటరమణ, ఎలిగేటి విజయలక్ష్మి, గొలగాని రమేష్‌, కెల్ల శ్రీనివాసరావు, బూర వాసు, కిల్లంపల్లి ఆచారి తదితరులు పాల్గొన్నారు. పూలే కృషి అమోఘమైనది విజయనగరం కోట : అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి అమోఘమని శ్రీనివాస ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి ఆర్‌బి రామానాయుడు, నారాయణ పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ మొయిద నారాయణరావు అన్నారు. గాజులరేగ నారాయణ పబ్లిక్‌ స్కూల్‌లో పూలే జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు విద్యార్థులు ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పూలే వేషధారణలతో అలరించారు. పూలే స్పూర్తితో ముందుకు వెళ్లాలి విజయనగరం కోట : జ్యోతిరావు పూలే స్పూర్తితో ముందుకు వెళ్లాలని విజయనగరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. పూలే జయంతి సందర్భంగా లోక్‌ సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి తొలుత అశోక్‌బంగ్లాలోను, అనంతరం కలెక్టరేట్‌ వద్దగల పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అదితి గజపతి రాజు మహిళలు చదువుకోవాలని, వారు పురోగతి పథంలో ఉంటే సమాజం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌ పాల్గొన్నారు. వేపాడ: మండల కేంద్రంలోని వల్లంపూడి గ్రామంలో జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల దళిత మహాసభ అధ్యక్షుడు కొమనాపల్లి రాము మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఒక సామాజిక విప్లకారుడని ఆయనలో ఉన్న తపన అతనకు ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుత్తి శ్రీను, కే అప్పారావు, జవాన్‌, బి. అప్పారావు, ఎస్‌ రమణ, టి కృష్ణ, ఆర్‌ సన్నిబాబు, పార్వతి, సత్యవతి, మనీ, వనిత పాల్గొన్నారు.కొత్తవలస: మండలంలోని తాడివని పాలెం, చింతలపాలెం గ్రామంలో జ్యోతిరావుపూలే 197వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర కన్వీనర్‌ ప్రముఖ అంబేద్కర్‌ రిస్ట్‌ రిట్టపల్లి అప్పన్న, ఎస్‌కోట నియోజకవర్గం బిఎస్‌పి అధ్యక్షులు బోని రాంబాబు హాజరై ప్రసంగించారు. సామాజిక విప్లవ పరివర్తకులలో జ్యోతిరావుపూలే ఈ సమాజానికి అశేషమైన సేవలు అందించారన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా, మహిళలకు చదువు చెప్పిన ఘనత, మహిళల ద్వారా సామాజిక విప్లవాన్ని రూపొందించిన రూపకర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు.భోగాపురం: మండలంలోని రెడ్డికంచెరు గ్రామంలో జ్యోతిరావు పూలే 198వ జయంతిని బిఎస్‌పి నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షులు ఎరుకొండ వెంకటరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎరుకొండ తేజరాణి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనగారిన వర్గాలను అగ్రవర్ణ బానిసత్వం నుంచి విముక్తులను చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని ఆమె కొనియాడారు.

➡️