ముద్దబంతి పువ్వులో..

Jan 14,2024 07:28 #Sankranti festival, #Sneha
flowers

‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో’ పాట ఆపాత మధురం. బంతిపూల కూడా మృదు మధురమే. సంక్రాంతి పండుగకు ఇంటికి చేరే ధాన్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో బంతిపూలకూ అంతే ప్రాధాన్యత ఉండేది. రెండు దశాబ్దాల క్రితం వరకూ.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటి ముంగిట పెద్ద పిండి ముగ్గు.. దాని మధ్యలో పేడతో చేసిన గొబ్బెమ్మ.. దానిపై బంతిపువ్వు.. చుట్టూ పువ్వు రెక్కలు ఎంతో శ్రద్ధగా చలిని లెక్కచెయ్యకుండా అలంకరించడం ఆనవాయితీ.బంతిపూలు పసుపు, నారింజ, కుంకుమ రంగుల్లో ఉంటాయి. ఇవి సాధారణంగా అలంకరణకు మాత్రమే అని భావిస్తాం. కానీ వీటిలో మంచి ఔషధ గుణాలున్నాయి. బంతి చెట్టు యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనిలో టానిన్‌లు, శాఫానిన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఆల్కలైట్స్‌, క్వినైన్‌లు, ఫినోల్స్‌, టెర్పనాయిడ్స్‌, కెమారిన్స్‌ అనే ఔషధ మూలకాలున్నాయి. అందుకే చెట్టు ప్రతి భాగాన్నీ మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఆస్తమా, ఇన్‌సోమ్నియా, అల్సర్లు, బ్రాంకైటిస్‌, నోటిపూత, మూత్రాశయ వ్యాధుల నివారణకు, చర్మం ముడతలు-వ్యాధులు తగ్గించేందుకు, కీళ్ళ నొప్పుల నివారణకు వాడే మందుల్లోను వీటిని ఉపయోగిస్తారు.

➡️