ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులు ఆలస్యం

Dec 25,2023 11:00 #Delhi, #Flight Ops, #Fog

న్యూఢిల్లీ :   దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రన్‌వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్‌ పోర్టుల్లో కూడా విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అమృతసర్,  ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌, ఆగ్రా, గ్వాలియర్‌ విమానాశ్రయాల్లో  0 విజిబిలిటీ నమోదైంది.  సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్‌ విమానాశ్రయంలో 300 మీటర్ల విజిబిలిటీ ఉంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డ్‌ ఢిల్లీలో ఎక్యూఐ సూచీ 400 పాయింట్లుగా నమోదైంది.

➡️