ఫ్లెక్సీలేనా? అభ్యర్థులు లేరా? : కొడాలి నాని

Feb 22,2024 13:40 #kodali nani

కృష్ణా : ‘మేము సిద్ధం’ అంటూ వైఎస్‌ జగన్‌కి పోటీగా జనసేత అధినేత పవన్‌కల్యాణ్‌ హడావిడి చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలినాని ‘ఫ్లెక్సీలేనా.. అభ్యర్థులు లేరా? అంటూ సెటైర్లు వేశారు. ‘మేం సిద్ధం అంటుంటే.. పవన్‌ కల్యాణ్‌ కూడా సిద్ధం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్మోహన్‌రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి సిద్ధం అంటున్నారు. మరి మీరు దేనికి సిద్ధం? మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికేనా మీరు సిద్ధం? క్యాండిడేట్లను పెట్టరా? ఫ్లెక్సీలే పెడతారా? మాపై మీ అభ్యర్థి నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది’ అని నాని పవన్‌కి సూచించారు.

➡️