వాడరేవు లో మత్స్యకారుల ఆందోళన : టిడిపి ఇంచార్జి కొండయ్య సంఘీబావం

Dec 8,2023 22:43

ప్రజాశక్తి – చీరాల
తుఫాన్ భాధిత మత్స్యకార కుటుంబాలను అదుకోవడంలో జగన్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని మత్య్సకారులు రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని వాడరేవులో మత్యకారులు శుక్రవారం అందోళన చేశారు. మత్స్యకారులను ప్రభుత్వం అదుకోవాలంటూ నినాదాలు చేశారు. గ్రామంలో 500కుటుంబాలు ఉంటే అధికారులు తుఫాన్ షెల్టర్‌లో ఉన్న 40కుటుంబాలకు మాత్రమే రు.2500 చొప్పున అర్దిక సహాయాన్ని అందించి చేతులు దులుపుకున్నారని అన్నారు. గత పదిరోజులుగా తుఫాన్ ప్రబావంతో వేటనిలిచిపోయి, ఇళ్ళలోకి నీరు చేరి, పూటగడవక ఇబ్బందులు పడుతున్న మిగిలిన మత్స్యకార కుటుంబాలను అదుకోవాలంటూ డిమాండ్ చేశారు. అందోళన చేస్తున్న మత్స్యకారులకు సర్ది చెప్పేందుకు వచ్చిన అధికారులపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మత్య్సకారులను అదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువేళ్ళి సమస్యను పరిష్కారిస్తామని తహసీల్దార్ జె ప్రభాకరరావు మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. మత్య్సకారుల ఆందోళనకు టిడిపి, జనసేన ఇంచార్జిలు ఎంఎం కొండయ్య, అమంచి స్వాములు మద్దతు ప్రకటించారు.

➡️