టెక్సాస్‌లో కార్చిచ్చు.. 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన..

Feb 28,2024 11:35 #fire acident, #Forest, #Texas
  •  2 లక్షల ఎకరాల్లో ఉన్న వృక్షాలు అగ్నికి ఆహుతీ

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం చాలా చిన్న చిన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2 లక్షల ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ అగ్నికీలలు దహించివేశాయని తెలిపారు.. స్మోక్‌హౌస్‌ క్రీక్‌ ఫైర్‌ లక్ష ఎకరాలను, గ్రేప్‌వైన్‌ క్రీక్‌ ఫైర్‌ 30,000 ఎకరాలను, విండీ డ్యూసీ ఫైర్‌ 8,000 ఎకరాలను కార్చిచ్చు దహించి వేసింది. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన కూడా అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో మూసివేశారు. టెక్సాస్‌ నుంచి ఈ కార్చిచ్చులు ఓక్లహామాకు పాకాయి. అక్కడ రెండు కౌంటీల్లో ఉంటున్న ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. ‘‘రోజర్‌ మిల్స్‌, ఎల్లిస్‌ కౌంటీల్లోని ప్రజలను తరలిస్తున్నాం’’ అని రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది పేర్కొన్నారు.

➡️