పుస్తకాల పండుగ

విజయవాడ కు విచ్చేసింది

పుస్తకాల పెద్ద పండుగ ..!

పుస్తక ప్రేమికులకు సైతం

మస్తుగా మస్తకాలు నిండగా..!

ప్రతి సంవత్సరం బెజవాడ లో

జనవరిలో జరుగుతోంది

అక్ష రాల సంపదతో భారీ జాతర ..!

కొత్త పాత పాఠకులు ,మేథావులు

ఊరు విడిచి ఉత్కంఠగా వస్తారు

కొత్త కితాబులు గుత్త గా కొనుగోలు చేస్తారు ..!

ప్రజా శక్తి వారి ప్రఖ్యాతి ప్రచురణలు

విశాలాంధ్ర వారి విలువైన రచనలు

ఇతర ప్రచురణల వారి విశిష్ట ప్రచురణలు

పుస్తకాల మేళాలో పుస్తకాల పురుగులను

విస్తుపోయేలా చేస్తాయి చూస్తుంటే..!

నవలోకంలో విహరించే నవలలు

కంచికి చేరని మా మంచి కథలు

భావకులు ఇష్ట పడే నవ కవితలు

బాలలు చదువుకునే బాలమిత్ర కథలు

ఆబాల గోపాలం ఆకట్టుకునే కార్టూనులు

అగ్ర విమర్శ కుల శిఖరాగ్ర రచనలు

చేయి తిరిగిన చేవగల రచయితల గ్రంథాలు

వేయి పడగలు వంటి పెద్ద పుస్తకాలు

ప్రపంచ భాషల్లో ని మంచి కితాబులు

భారతీయ భాషలలో ని అమూల్య పుస్తకాలు ఎన్నెన్నో

చరిత్ర సృష్టించిన రచయితల గరిమ రచనలు

చరిత్ర, సైన్స్‌, వ్యక్తిత్వ వికాసం ,పరిశోధన,

భాషావిజ్ఞాన కోశాలు

విజయవాడలో వేలాది గా కొలువై ఉన్నాయి..!

ప్రియ మైన పాఠకులు లారా..రయంగా రండి

అక్ష రాల పరిమళాలు మనసారా ఆస్వాదించండి..!

– జి. సూర్య నారాయణ, 6281725659

➡️