స్థంభించిన ఫేస్‌బుక్‌, ఇస్టాగ్రామ్‌

Mar 6,2024 11:18 #Facebook, #Instagram

లాగిన్‌ విఫలం, ఆకస్మిక లాగౌట్లతో తిప్పలు

 హ్యాకింగ్‌ ఆందోళనలతో హడలెత్తిన వినియోగదారులు

న్యూఢిల్లీ   :   మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా వేదికలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌, మెసెంజర్‌ సర్వీసులన్నీ మంగళవారం కొన్ని గంటల పాటు స్థంభించాయి. ఆకస్మిక ఖాతాలు వాటికవే లాగౌట్‌ అవ్వడం, లేదా లాగిన్‌ సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడంతో వినియోగదారులు తిప్పలు పడ్డారు. లాగౌట్‌, లాగిన్‌ విఫలం సందేశాలతో వినియోగదారులు తమ ఖాతాలను ఎవ్వరైనా హ్యాకింగ్‌ చేశారేమోనని తీవ్ర ఆందోళనపడ్డారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచే అంతరాయాలు ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది మరో సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి ఆకస్మాత్తుగా లాగవుట్‌ అవుతున్నామని, లేదా వీటిని లాగిన్‌ అవ్వడం సాధ్యంకావడం లేదని ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తర్వాత అంతరాయాలపై మెటా సంస్థ స్పందించింది. సేవా లోపాలు తమ దృష్టికి వచ్చాయని, పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మెటా కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి ఆండీ స్టోన్‌ తెలిపారు. ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

➡️