రోటరీ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

Feb 11,2024 22:55

ప్రజాశక్తి – పంగులూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ భవన్ వద్ద ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిభిరంలో 100మందికి పరీక్షలు చేసినట్లు రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ చిలుకూరి వీరరాఘవయ్య, అధ్యక్ష, కార్యదర్శులు కరణం హనుమంతరావు, షేక్ కాలేషావలి తెలిపారు. వీరిలో 45మందికి శుక్లంల ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారని తెలిపారు. వీరిని కాకాని శంకర్ కంటి ఆసుపత్రికి సోమవారం తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిలుకూరు వీర రాఘవయ్య మాట్లాడుతూ గత 16ఏళ్లుగా ఏడాదికి రెండుసార్లు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 7500మందికి శుక్లంల ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశామన్నారు. ఈ 16 ఏళ్ళ కాలంలో ఆపరేషన్ చేయించుకున్న ఎవరికీ ఏ ఇబ్బంది రాలేదని తెలిపారు. శంకర్ కంటి వైద్యశాల వైద్యులు కూడా తమకు ఎంతో సహకరించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలా ఎన్నో శిబిరాలు పెట్టి ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. డాక్టర్ పద్మప్రియ, డాక్టర్ చింతన్ రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ పంగులూరు కోశాధికారి గుర్రం ఆంజనేయులు, రోటరీ సభ్యులు జాగర్లమూడి సుబ్బారావు, బాచిన వెంకట రామారావు, రాయిని వెంకట సుబ్బారావు, పోలిశెట్టి సీతారామయ్య, పోతిని ప్రసాద్, ఇమ్మడిశెట్టి సుబ్బారావు, క్యాంప్ ఇన్చార్జి గంగాధర్, శంకర్ కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️