కళ్లుచెదిరే కళ.. కలంకారీ..

Apr 14,2024 12:44 #fashion, #Sneha

కలంకారీ అనేది ఓ సృజనాత్మక కళ. ప్రకృతిలో నుంచి రంగులైనా, బొమ్మలైనా కలంకారీకి ఆధారం. ప్రకృతిలోని బొమ్మల్ని, ఎండిన ఆకులు, బెరళ్లు, కాయలతో తయారుచేసిన రంగుల్లో ముంచి తీర్చిదిద్దితేనే కలంకారీ చీరలకు అద్దుకునేది. ఈ కళను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.. ఆ రంగులు, బొమ్మలు కళ్లు చెదిరేలా ఉంటాయి. వేసవిలో కలంకారీ కాటన్‌ చీరలు అందానికి అందం.. చల్లదనానికి చల్లదనం.. పర్యావరణాన్ని కాపాడే కలంకారీని ఆదరిద్దాం..

➡️