తగలబడుతోన్న చెత్తలో పేలుడు.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..!

Nov 28,2023 14:40 #burning garbage, #Explosion

కాకినాడ: కాకినాడలో విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది.. చెత్త తగలబెట్టే క్రమంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. మామిడాడ ఏలేరు కాలువ దగ్గరలో చెత్తను వేస్తూ వస్తున్నారు పంచాయతీ సిబ్బంది.. ఎవరూ లేని సమయంలో అక్కడే చెత్తను తగలబెడుతుంటారు.. అయితే, మంగళవారం మాత్రం పంచాయితీ సిబ్బందికి తెలియకుండానే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను తగలబెట్టారు.. అదే సమయంలో.. ఏలేరు కాలువలో స్నానాలు చేయడానికి వచ్చారు ఎనిమిది మంది విద్యార్థులు.. కలువ సమీపంలోనే చెత్త తగలబెట్టడంతో.. మంట కాగుతున్న సమయంలో తగలబడుతున్న చెత్త నుంచి భారీ శబ్దంతో పేలుడు సంబంధించింది.. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులకు స్వల్ప గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రతిపాడు గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కు తరలించారు స్థానికులు.. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుండగా.. వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

➡️