ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేతపై భారత రాయబార కార్యాలయం వివరణ

Dec 23,2023 12:05 #flights, #France

ఢిల్లీ : హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అనుమానంతో భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానంలోని ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్టర్‌ ద్వారా స్పందించింది. ‘303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఆపేసినట్లు ఫ్రెంచ్‌ అధికారులు తెలియజేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు దుబారు నుంచి నికరాగువా వెళుతున్నారు. మానవ అక్రమరవాణా జరుగుతోందనే సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఎంబసీ బృందానికి కాన్సులర్‌ యాక్సెస్‌ లభించింది. పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ప్రయాణికులను విచారిస్తున్నాం’ అంటూ భారత ఎంబసీ ట్వీట్‌ చేసింది.

➡️