బరువును తగ్గించుకుంటున్న సమంత

Jan 13,2024 08:29 #samantha

హైదరాబాద్‌ : ప్రముఖ నటి సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి సమంత ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా తమ బరువు నియంత్రణలో ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకే సమంత కూడా తన బరువును తగ్గించుకునేందుకు జిమ్‌లో కష్టపడుతుంది. తాజాగా ఆమె జిమ్‌లో డంబెల్‌ని మోస్తున్న ఫొటోలను తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వయసుకు తగ్గ బరువు ఉంటేనే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

➡️