తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్‌హిల్‌ విస్తరణ

Jan 23,2024 08:11 #Business

హైదరాబాద్‌ : సంప్రదాయ, ఫ్యాషన్‌ దుస్తుల బ్రాండ్‌ డ్రాగన్‌ హిల్‌ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కల్వకుర్తి, సంగారెడ్డి, ఖమ్మం, ఆర్మూర్‌, నిర్మల్‌, అనకాపల్లిలో కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు వెల్లడించింది. దక్షిణాదిలో ప్రవేశాన్ని వేడుక చేసుకోవడానికి డ్రాగన్‌ హిల్‌ 50 శాతం వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నట్లు డ్రాగన్‌ హిల్‌ వ్యవస్థాపకుడు మయూర్‌ సోలంకి తెలిపారు.

➡️