వైజ్ఞానిక రంగంలో మహిళలకు సమ ప్రాధాన్యం

Feb 13,2024 10:57 #UNO

ఐరాస చీఫ్‌ పిలుపు

ఐక్యరాజ్యసమితి : విజ్ఞానశాస్త్రంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించి, ప్రోత్సహించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి11న ‘సైన్స్‌లో బాలికలు, మహిళలు’ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఆయన ఒక సందేశమిస్తూ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలు, బాలికల కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత గురించి గుటెరస్‌ నొక్కిచెప్పారు. అందరికీ మంచి భవిష్యత్తును నిర్మించేందుకు సైన్స్‌లో లింగ సమానత్వం అత్యంత ఆవశ్యకమన్నారు. శాస్త్రీయ సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను గుటెరస్‌ ప్రస్తావించారు. సైన్స్‌లో వత్తిని కొనసాగించకుండా నిరోధించే శారీరకపరమైన అడ్డంకులు, వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన చెప్పారు. మహిళలు అంతర్జాతీయ సైన్స్‌ సమాజంలో మూడింట ఒక వంతు మాత్రమే ఉన్నారని, వారు నిధులు, ప్రచురణ అవకాశాలు ఉన్నత స్థానాలను పొందడంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ”వాతావరణ మార్పుల నుండి కత్రిమ మేధస్సు వరకు అన్ని రంగాల్లోను సరికొత్త ఆవిష్కరణల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగేలా చూడాలని ఆయన కోరారు. అందరికీ విజ్ఞానం అందేలా చూసేందుకు ఇదే ఏకైక మార్గం” అని ఆయన ఉద్ఘాటించారు. సైన్స్‌లో లింగ అంతరాన్ని తగ్గించడానికి, గుటెర్రెస్‌ ”లింగ మూస పద్ధతులను తొలగించడం మరియు సైన్స్‌ని ఎంచుకోవడానికి బాలికలను ప్రోత్సహించే రోల్‌ మోడల్‌లను ప్రోత్సహించడం, సైన్స్‌లో మహిళల అభివద్ధికి తోడ్పడే కార్యక్రమాలను చేపట్టడం వంటివి చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

➡️