Enforcement Directorate: హేమంత్‌ సోరెన్‌పై ఇడి చార్జిషీటు

న్యూఢిల్లీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చార్జిషీటు దాఖలు చేసింది. భూకుంభకోణంలో సోరెన్‌ రూ.600 కోట్ల మేర అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొంది. ల్యాండ్‌ మాఫియాలో సోరెన్‌ భాగమని, మాఫియాలో వచ్చిన అక్రమ ఆదాయాన్ని కలిగివున్నారని ఆరోపించింది. హేమంత్‌ సోరెన్‌కు చెందిన 8.86 ఎకరాల భూమికి సంబంధించి కీలక సమాచారం కలిగిన 44 పేజీల ఫైల్‌ను విచారణ సమయంలో ప్రతాప్‌ కార్యాలయంలో గుర్తించామని తెలిపింది. ప్రతాప్‌ సోరెన్‌ను బాస్‌ అని పిలిచేవారని చార్జిషీట్‌ పేర్కొంది. రాంచీలోని బార్గెన్‌ ప్రాంతంలో సోరెన్‌కు 8.86 ఎకరకాల అక్రమ భూమి, బిఎండబ్ల్యు కారు ఉన్నాయని వెల్లడించింది. సోరెన్‌తో పాటు రెవెన్యూ అధికారి భాను ప్రతాప్‌ ప్రసాద్‌, మరో ఇద్దరు ఉద్యోగులను నిందితులని తెలిపింది. 33 మంది సాక్షుల రికార్డులను సేకరించామని, వేలాది పేజీల పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఇడి చార్జిషీటులో తెలిపింది. హేమంత్‌ సోరెన్‌, రాంచీ మాజీ డిసి, ఐఎఎస్‌ అధికారి చవి రంజన్‌ సహా 16 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

➡️