ఎమర్జింగ్‌ టెన్నిస్‌ విజేత యమ్లపల్లి

Dec 25,2023 20:03 #Sports, #Tennis

సోలాపూర్‌: సోలాపూర్‌ ఓపెన్‌ మహిళల ఐటిఎఫ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను 23ఏళ్ల సహజ యమ్లపల్లి కైవసం చేసుకుంది. ఎంఎస్‌ఎల్‌టిఏ టెన్నిస్‌ సెంటర్‌లో జరిగిన ఫైనల్లో 7వ ర్యాంకర్‌ యమ్లపల్లి 6-4, 6-3తో 2వ ర్యాంకర్‌, రియో ఒలింపిక్స్‌ మహిళల డబుల్స్‌ విజేత ఎక్టేరినా మకోరోవా(రష్యా)ను చిత్తుచేసింది. ఏటిపి సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో యమ్లపల్లి 412వ స్థానంలో ఉండగా.. ఎక్టేరినా 186వ ర్యాంకర్‌. విజేతగా నిలిచిన యంలపల్లికి 25వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. అలాగే వచ్చేవారం ప్రకటించే ఏటిపి మహిళల ర్యాంకింగ్స్‌లోనూ 72స్థానాలు మెరుగుపరుచుకొని ఏకంగా 340వ స్థానంలో నిలవనుంది.

➡️