ఎన్నికల హామీ ఉత్తివే

Apr 13,2024 20:59

భీమసింగి సహకార చక్కెర కర్మాగారం విషయంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ ఒకే వైఖరి అవలంభిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఈ సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది. కానీ ఆ నెపాన్ని రైతులపైకి నెడుతూ సాగుకు సరిపడా చెరకు లేకపోవడం వల్లే ఫ్యాక్టరీ నడవడం లేదని ప్రజాప్రతినిధులు చెప్పడం అటు రైతులను, కార్మికులను ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో చంద్రబాబు వైఖరితో ఈ ఫ్యాక్టరీ మూతపడితే తాజాగా జగన్‌ ప్రభుత్వం కూడా దాన్ని తెరిపించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ ప్రాంత రైతాంగానికి, కార్మికులకు బతుకు తెరువినిచ్చే ఫ్యాక్టరీని మూసేసి ఈ ప్రాంతంలో చెరకు పంట కనుమరుగయ్యేలా చేసింది. ఉన్నంతలో ఫ్యాక్టరీని నడిపి రైతులకు బాసటగా నిలవాలన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. కానీ పాలకపక్షాలు ఎన్నికల సమయాల్లో హామీలు గుప్పించి, అధికారం చేపట్టక మాటతప్పడం పరిపాటిగా మారింది.

ప్రజాశక్తి – జామి: భీమసింగి చక్కెర ఫ్యాక్టరీకి సుదీర్ఘకాల చరిత్ర ఉంది. రైతులు షేర్‌ ధనంతో నిర్మించుకున్న ఈ ఫ్యాక్టరీని మూసివేసి రైతులను, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను నట్టేలా ముంచేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన వైసిపి.. అధికారం లోకి వచ్చి ఐదేళ్లుఅయినా కమిటీల పేరుతోనే కాలయాపన చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో సహకార రంగ ఫ్యాక్టరీలకు ఒక్క రూపాయి కూడా సహకారం అందలేదు. అప్పట్లో చంద్రబాబు కూడా నిపుణుల కమిటీని వేసి, చేతులు దులుపుకున్నారు. చివరికి ప్రభుత్వం దిగిపోయినా, ఆ కమిటీ నివేదిక మాత్రం బహిర్గతం కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఉత్తుత్తివేవెను వెంటనే సహకార ఫ్యాక్టరీల స్థితిగతులపై గురవారెడ్డి అధ్యక్షతన ఓ కమిటీని వేసింది. ఆ నివేదిక కూడా ఇంతవరకు బయటకు రాలేదు. తర్వాత మరోసారి ప్రభుత్వం రెండేళ్ల క్రితం జూన్‌ 25న ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. ఇందులో జిల్లాకు చెందిన అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్‌ రెడ్డి ఉన్నారు. అదే ఏడాది ఆగస్టు 15 తేదీలోగా, కమిటీ నివేదికను అందజేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ అదంతా బూతకంగానే మిగిలింది.ఫ్యాక్టరీని నిలబెట్టే చర్యలపై దృష్టి సారించాలిసహకార ఫ్యాక్టరీలను బాగు చేసేందుకు అనేక అవకాశాలున్నాయి. ప్రధానంగా సహకార ఫ్యాక్టరీలన్నీ పురాతనమైనవి కావడంతో ముందుగా యంత్రాలను ఆధునీకరించాలి. తక్షణమే క్రషింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా బయో ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లు నెలకొల్పడం సాధ్యమవుతుంది. దీనికి సుమారుగా రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు అవసరం ఉంటుందని అంచనా. ఈ మూడింటిపై దష్టిసారిస్తేనే మనుగడ సాధ్యం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఎజెండాగా భీమసింగి ఫ్యాక్టరీ అంశం ఉండాలని రైతులు కోరుతున్నారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ఏం చేస్తారో చెప్పాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. పొటో : భీమసింగి సుగర్‌ ప్యాక్టరీ ఫైల్‌ పోటో పెట్టాలి. వాస్తవానికి సహకార ఫ్యాక్టరీలన్నింటిలోనూ చెరకు క్రషింగ్‌ శాతం తగ్గింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఫలితంగా చెరకు మద్దతు ధర లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహకారమూ లేకపోవడంతో రైతులకు చెరకు సాగుపట్ల ఆసక్తి తగ్గుతోంది. భీమసింగి సహకార ఫ్యాక్టరీ ఒకప్పుడు 1.60 లక్షల టన్నులు క్రషింగ్‌ చేయగా, ప్రస్తుతం 30 వేల టన్నులు కూడా లభ్యం కాదని అధికారులు సెలవిస్తున్నారు. ఆధునీకరణ చేస్తామన్న పేరుతో క్రషింగ్‌ను ఆపేసింది. దీంతో ఫ్యాక్టరీ మూతబడడం ఖాయమని తెలిపోయింది. ఈ తరుణంలోనే వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. కానీ వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదు.

➡️