ఈద్‌ముబారక్‌

జిల్లావ్యాప్తంగా రంజాన్‌ వేడుకలను

నమాజ్‌ చేస్తున్న ముస్లిం సోదరులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లావ్యాప్తంగా రంజాన్‌ వేడుకలను ముస్లిం సోదరులు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. మసీదుల్లో మత గురువులు ఖురాన్‌ పఠనం, సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్‌ముబారక్‌ చెప్తూ పరస్పరం ఆత్మీయతతో కూడిన ఆలింగనం చేసుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని చారిత్రక జామియా మసీదులో వందల సంఖ్యలో ముస్లిములు నమాజ్‌ చేశారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ జామియా మసీదులో ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు ముస్లిములు చేపట్టిన ఉపవాస దీక్ష ముగిసింది. ప్రార్థనలతో మసీదులన్నీ కళకళలాడాయి. ఉదయాన్నే మసీదులకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు రంజాన్‌ విశేషాలను వివరించారు. అందరూ కలసి సహపంక్తిలో ఫలహారాన్ని స్వీకరించారు. ముస్లిములే కాక ముస్లిమేతర సోదరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లాలోని ఇతర మసీదుల్లోనూ రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జామియా మసీదుకు వెళ్లి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

➡️