నిరుపేద కాపు విద్యార్థుల అభ్యున్నతికి కృషి

Dec 10,2023 23:29

ప్రజాశక్తి – బాపట్ల
నిరుపేద కాపు విద్యార్థుల విద్యాభివృద్ధికి కాపు సేవా సంఘం కృషి చేస్తోందని మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సూర్యలంక తీరంలో ఆదివారం జరిగిన కాపు వన సమారాధనలో ఆయన మాట్లాడారు. కాపు సామాజిక వర్గంలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.12లక్షల 44వేలు విద్యా పురస్కారాలు అందజేశారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున విద్యా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, పర్వతరెడ్డి భాస్కరరావు, కొటికలపూడి సురేష్, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, అంజనేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరావు, సీనియర్ కాపు నాయకులు అంబటి మురళి, మాజీ మున్సిపల్ చైర్మన్ జిట్టా ప్రమీలరాణి, సీనియర్ మహిళా కాపు నాయకురాలు గుంటుపల్లి తులసికుమారి, దమ్మనవారిపాలెం సర్పంచి వేంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.

➡️