ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

Feb 28,2024 23:25

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రానున్న సాధారణ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను స్థానిక విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో భద్రపర్చనున్నారు. దీనికి గాను పాఠశాల్లో సుమారు 12 తరగతి గదులను అధికారులు స్వాధీనం చేసుకుని ఈవీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గ స్థాయిలో భట్టిప్రోలులోనే వీటిని భద్రపరిచి ఇక్కడ నుండే అన్నీ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. అన్ని ఏర్పాట్లను తహశీల్దారు పద్మావతి చేశారు. ఇవిఎంలు బద్రపరుస్తున్న గదులను జడ్పీ సీఈఒ, ఎన్నికల అధికారి ఎన్ఎస్‌విబి వసంతరాయుడు బుధవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కిటికీలు, వెంటిలేటర్లు మూసివేశారు. దానిలో అవసరమైన విద్యుత్ సౌకర్యం సిద్ధం చేశారు. పాఠశాల కావడంతో స్ట్రాంగ్ రూంకు అనుగుణంగా గదులకు తలుపులను అధికారులే సిద్ధం చేసుకున్నారు. త్వరలో ఈవీఎం మిషన్లు రానున్నాయని తెలిపారు. యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అశ్రద్ద చేయవద్దని, తోడ్పాటు అందించాలని పాఠశాల కరస్పాండెంట్ ఎంపీ వెంకట్రావును కోరారు. ఈ 12 గదుల్లో 4గదులు ఏవీఎంలు ఏర్పాటు చేయడానికి, 2గదులు సెక్యూరిటీ సిబ్బందికి, మరో 2గదులు ఇతర అవసరాలకు పోను మిగిలిన వాటిని అవసరాన్ని బట్టి వినియోగించుకునే విధంగా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఒ మల్లికార్జునరావు, సర్వేయర్ శ్రీనివాసరావు ఉన్నారు.

➡️