పోరాటాల ఫలితమే కాకినాడలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌

Feb 24,2024 13:40 #ESI Hospital, #Kakinada, #Result, #struggles

ప్రజాశక్తి-కాకినాడ : ఈఎస్‌ఐ హాస్పిటల్‌ కాకినాడలో ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితంగానే కాకినాడలో ఈఎస్‌ఐ ఆసుపత్రి వచ్చిందని సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణలు తెలియజేశారు. రేపు (ఆదివారం) ప్రారంభం కాబోతున్న ఈఎస్‌ఐ ఆసుపత్రిని సిఐటియు నేతలు సందర్శించి హాస్పటల్లో సౌకర్యాలు, సిబ్బంది, డాక్టర్లు వంటి వాటిని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … గత 30 ఏళ్ల నుంచి సిఐటియు, ఇతర కార్మిక సంఘాలు, వామపక్షాలు ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ను కాకినాడలో ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేశాయని అన్నారు. ఈ పోరాటాల ఫలితంగానే హాస్పటల్‌ ఇక్కడ వచ్చిందని అన్నారు. ఆదివారం ప్రారంభం కాబోతున్న ఈ హాస్పటల్లో అన్ని రకాల సౌకర్యాలు, సిబ్బందిని త్వరితగతిన నియమించే ఏర్పాటు చేసి కార్మికులందరికీ ఈ హాస్పిటల్‌ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈఎస్‌ఐ వర్తింప చేయకుండా చాలామంది కార్మికులు కాకినాడ నగరంలోని ఉన్నారని, వారందరికీ ఈఎస్‌ఐ కార్డులు వచ్చేలాగా తద్వారా హాస్పటల్‌ సౌకర్యాలు అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. షాపింగ్‌ మాల్స్‌ పెద్ద ఎత్తున కాకినాడలో ఉన్నాయని వీటిలో ఈఎస్‌ఐ వర్తించేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభం కాబోతున్న ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ను అన్ని రకాల సౌకర్యాలతో సిబ్బందితో అందుబాటులోకి తీసుకువస్తే కాకినాడ జనరల్‌ హాస్పటల్‌ పై రోగుల ఒత్తిడి కొంతమేరకైనా తగ్గుతుందని అన్నారు. ఈ విషయాలపై అధికారులు దఅష్టి పెట్టాలని నేతలు కోరారు.

➡️