డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తగదు

Feb 8,2024 08:15 #aidwa, #Dwcra
aidwa ramavathi padmavathi on dwcra

ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా మార్టుల్లో సరుకు లు కొనాలని డ్వాక్రా మహిళ లపై ఒత్తిడి తీసుకురావడాన్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని ఐద్వా రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెర్ప్‌ సిఇఒ ఇంతియాజ్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. మార్టులో సరుకులు కొనుగోలు చేయని డ్వాక్రా గ్రూపు సభ్యులకు భవిష్యత్‌లో బ్యాంకు రుణాలు రావని, రుణ మాఫీలు వర్తించవని బెదిరిస్తున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలతో సరుకుల కొనుగోలు చేయించడానికి ఆర్‌పిలకు టార్గెట్లు పెడుతున్నారని, గ్రూపులోని ప్రతి సభ్యురాలు నెలకు రూ.రెండు వేలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో పొదుపు ఖాతాల నుంచి గ్రూపులకు తెలవకుండానే మహిళా మార్టుల ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్‌ అవుతోందన్నారు. చోడవరంలో గ్రూపు సభ్యుల ఆమోదం లేకుండానే మార్టు ఏర్పాటుకు ఒక్కొక్కరి ఖాతా నుంచి రూ.మూడు వేలు కట్‌ చేశారని తెలిపారు. మార్టు పెట్టిన తర్వాత నెలకు రూ.2 వేలు కచ్ఛితంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నా రన్నారు. జగనన్న మార్టులో పెట్టుబడి మొత్తం డ్వాక్రా గ్రూపులతోనే పెట్టిస్తున్నారన్నారు. ఈ మార్టుల్లో రైతుల ఉత్పత్తులను సేకరించి అమ్మకుండా బహుళజాతి కంపెనీల సరుకులను అమ్మించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సరైంది కాదన్నారు. గ్రామీణ ప్రాంత గ్రూపుల ద్వారా రైతుల ఉత్పత్తులను సేకరించి మార్టుల్లో న్యాయమైన ధరలకు వినియోగదారులకు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభయ హస్తం పథకం నగదు ప్రభుత్వం వద్ద ఎంత ఉందో ప్రకటించాలన్నారు. వెంటనే అభయహస్తం దరఖాస్తుదారులకు నగదు చెల్లించాలన్నారు. స్త్రీ నిధికి సంబంధించి గ్రూపు రుణాలు మంజూరు, వసూళ్లు అకౌంట్‌ నిర్వహణలో భాగస్వాములైన అందరికీ అందించాలన్నారు. విఒఎలు, ఆర్‌పిలకు అదనపు పనులు అప్పగించి వేధించడం మానుకోవాలని, పెర్ఫామెన్స్‌ పేరిట వేతనాల్లో కోత విధించడాన్ని మానుకోవాలన్నారు. పొదుపు డబ్బులను అంతర్గత రుణాలి వ్వడానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. బ్యాంకు ప్రాసెసింగ్‌ ఛార్జీలను రద్దు చేయాల న్నారు. దీనిపై సిఇఒ ఇంతియాజ్‌ స్పందిస్తూ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.

➡️