సొనాఫితో డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక భాగస్వామ్యం

Mar 27,2024 21:20 #Business

హైదరాబాద్‌ : సొనాఫి హెల్త్‌కేర్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌ఐపిఎల్‌)తో డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తన సొనాఫీ వ్యాక్సిన్‌ బ్రాండ్లను డాక్టర్‌ రెడ్డీస్‌ సరఫరా చేయనుంది. సొనాఫికి చెందిన పెడియాట్రిక్‌, పెద్దల వ్యాక్సిన్లు అయినా హెక్సాజిమ్‌, పెంటాక్సిమ్‌, టెట్రాక్సిమ్‌, మెనాక్ట్రా, ప్లూక్వాడ్రి, అడాసెల్‌, అవక్సిమ్‌80యు తదితర వ్సాక్సిన్లకు రెడ్డీస్‌ ప్రచారం కల్పించడంతో పాటుగా సరఫరా చేయనుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ కంపెనీగా నిలువాలని భావిస్తోంది. ఈ బ్రాండ్ల మొత్తం అమ్మకాల విలువ రూ.426 కోట్లుగా ఉంది. సొనాఫి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తోంది. ఈ అవకాశం తమకు గొప్ప అవకాశంతో పాటు సంతోషాన్ని ఇస్తుందని డాక్టర్‌ రెడ్డీస్‌ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సిఇఒ ఎంవి రమణ పేర్కొన్నారు.

➡️